బెల్లంపల్లిలో విషాదం.. పోచమ్మ చెరువులో పడి వ్యక్తి మృతి

by Aamani |
బెల్లంపల్లిలో విషాదం.. పోచమ్మ చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో హమాలీ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న పట్టణంలోని శాంతిఖని బస్తీకి చెందిన గుజ్జుల మురళి ప్రమాదవశాత్తు బెల్లంపల్లి టౌన్ పరిధిలోకి వచ్చే పోచమ్మ చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం తోటి స్నేహితులతో కాలక్షేపం నిమిత్తం వెళ్లి చెరువులో స్నానానికి దిగిన మురళి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ ఈతగాళ్లతో త్రీ టౌన్ ఎస్ఐ సమ్మయ్య గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story