సాగర్ బైపోల్.. ‘కోమటిరెడ్డి’కి బీజేపీ బంపర్ ఆఫర్..?

by Shyam |   ( Updated:2021-03-17 06:33:45.0  )
సాగర్ బైపోల్.. ‘కోమటిరెడ్డి’కి బీజేపీ బంపర్ ఆఫర్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల కాగా, ఏప్రిల్ 17వ తేదిన పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ పేర్కొంది. అయితే, సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పేరును ఆ పార్టీ నిన్న డిక్లేర్ చేయగా… అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాలేదు.

ఈ నేపథ్యంలోనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనను సాగర్ ఉపఎన్నిక బరిలో దించాలని బీజేపీ భావిస్తోందని, ఈ విషయంపై తనను సంప్రదించిందని తెలిపారు. తాను ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని మునుగోడు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలంటే ప్రస్తుత పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటారా లేదా అనేది ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడేంత వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story