- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ పై స్పందించిన నటి.. ఏమందంటే ?
దిశ, సినిమా : యాక్ట్రెస్ మున్మున్ దత్తా ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ కోస్టార్ రాజ్ అనద్కత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఫైర్ అయింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న మీడియాపై మండిపడుతూ.. అనుమతిలేకుండా వ్యక్తిగత జీవితం గురించి ఊహాత్మక కథనాలను ప్రసారం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. నిర్లక్ష్యపు ప్రవర్తనతో తమ జీవితాలకు నష్టం కలిగితే బాధ్యత వహిస్తారా? అంటూ టీఆర్పీ రేటింగ్ కోసం అంతిమయాత్రలను కూడా వదలని మీడియా, ఒకరి గౌరవాన్ని పణంగా పెట్టి సంచలనాత్మక కథనాలు సృష్టించేందుకు ఎంత స్థాయికైనా దిగజారుతుందని విమర్శించింది.
ఇక తన పోస్ట్‌లకు నెగెటివ్ కామెంట్ చేసిన నెటిజన్లపై విరుచుకుపడిన మున్మున్ దత్తా.. సాధారణ ప్రజలపై చాలా అంచనాలు కలిగి ఉన్న తన నమ్మకాన్ని వమ్ముచేశారని, చదువుకున్న వారు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం తిరోగమన సమాజానికి ఎగ్జాంపుల్‌గా ఉందని చెప్పింది. మీ హాస్యం మానసిక క్షోభకు గురిచేస్తూ, మహిళలు నిరంతరం సిగ్గుపడేలా చేస్తుందన్న నటి.. 13 ఏళ్లుగా నటిస్తూ అలరిస్తున్న తన పరువు తీసేందుకు మీకు 13 నిమిషాలు కూడా పట్టలేదని, భారతదేశ ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.