- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్‌లో పురపాలక సంఘాలకు నిధుల పెంపు!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వేగంగా పట్టణీకరణ చెందుతున్న క్రమంలో జీవన ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు, ప్రజల జీవన శైలి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మునిసిపాలిటీలకు బడ్జెట్‌లో నిధులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో పురపాలక సంఘాలకు రూ. 2 లక్షల కోట్లను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం నివేదిక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాలకు నిధులతో సహా పలు సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయంతో ఆయా స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితులను గణనీయంగా మెరుగుపరుస్తుంది. గతంలో పట్టణాల అభివృద్ధి కోసం 14వ ఫైనాన్స్ కమిషన్‌లో రూ. 87 వేల కోట్లను కేటాయించారు. దీన్ని 2016-20 మధ్యకాలంలో వినియోగించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం మధ్యంతర నివేదిక ఇచ్చారు. దేశంలోని పట్టణాలు వేగవంతమైన అభివృద్ధికి నోచుకోవాలంటే ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఈ క్రమంలోనే ఫైనాన్స్ కమిషన్ నిధులు తగినంత పారదర్శకంగా ఉంటే, ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తారని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది కొవిడ్-19 వల్ల స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పన్ను వసూళ్లను పెంచితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పురపాలక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రమాణాలను అనుసరించి పట్టణాలకు నిధులను కేటాయించనున్నారు.