‘అన్నపూర్ణ’ సదుపాయాన్ని పెంచాలి – ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో: మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ‘అన్నపూర్ణ’ కేంద్రాలను పెంచాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం 200 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతి రోజు లక్షన్నర మందికి లంచ్, డిన్నర్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. లాక్‌డౌన్ మరో 17 రోజులు ఉన్నందున మరిన్ని కొత్త అన్నపూర్ణ కేంద్రాల ఏర్పాటు చేయాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పేదలు, వలస కార్మికులకు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా లంచ్, డిన్నర్ సదుపాయాలు కల్పిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లంచ్ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, డిన్నర్ రాత్రి 7 గంటల వరకు ముగించేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు సూచించారు.

Tags :GHMC, Annapurna Centres, Municipal Secretary, Lunch, Dinner

Advertisement

Next Story

Most Viewed