- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తోలు తీయిస్తా.. వెళ్లి ఎమ్మెల్యేకు చెప్పుకో.. మహిళా అధికారిపై మున్సిపల్ కమిషనర్..
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేటలో ఓ మహిళా వాలంటీర్‌పై మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారు. ఆమెపై కోపంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వాలంటీర్ ఉద్యోగం తీసిపడేస్తా.. పోయి ఎమ్మెల్యేకు చెప్పుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.
వివరాల ప్రకారం.. 3వ వార్డు వాలంటీర్ అక్తర్ పిల్లలకు అన్నం పెట్టేందుకు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి.. ఆమెకు ఫోన్ చేసి వెంటనే సచివాలయానికి పిలిపించారు. వచ్చిన వెంటనే ఆమెపై ఆగ్రహంతో కమిషనర్ విరుచుకుపడ్డారు. సచివాలయంలో అందుబాటులో ఉండాలని.. ఐదు నిమిషాల్లో లోపల వేయించి తోలు తీయిస్తానని బెదిరించారు.
వాలంటీర్ ఉద్యోగం తీసిపడేస్తా.. పోయి ఎమ్మెల్యేకు చెప్పుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో వాలంటీర్ వివరణ ఇచ్చేందుకు ట్రై చేసినా పట్టించుకోలేదు. దీంతో కమిషనర్ తీరుపై వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమిషనర్ తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే వాలంటీర్‌పై మున్సిపల్ కమిషనర్ దురుసు ప్రవర్తన వ్యవహారంపై గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ నరసరావుపేట ఆర్డీవోతో విచారణకు ఆదేశించారు.