అతడిని భారత్‌కు అప్పగించం: యూఎస్ అటార్నీ

by vinod kumar |
అతడిని భారత్‌కు అప్పగించం: యూఎస్ అటార్నీ
X

వాషింగ్టన్: ముంబయి 26/11 ఉగ్రవాద దాడుల్లో మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీని భారత్‌కు అప్పగించబోమని, పాకిస్తాన్ మూలాలున్న కెనడియన్ బిజినెస్‌మెన్, ఈ దాడుల్లో కుట్రదారుడు, హెడ్లీ బాల్యమిత్రుడు తహవ్వుర్ రాణాను అప్పగించడాన్ని పరిశీలిస్తామని యూఎస్ అటార్నీ ఫెడరల్ కోర్టుకు తెలిపారు. తహవ్వుర్ రాణా బెయిల్‌ను నిరాకరిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రదాడిలో తహవ్వుర్ హస్తమున్నదని, అతన్ని పట్టుకోవాల్సిందిగా భారత్ విజ్ఞప్తి చేసిన తర్వాత లాస్ఏంజిల్స్‌లో జూన్ 10న రాణాను అమెరికా మళ్లీ అరెస్టు చేసింది. ముంబయి దాడుల్లో హెడ్లీ తన పాత్రను ఒప్పుకున్నారని, ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు గనుక ఇండియాకు తరలించాల్సిన అవసరం లేదని యూఎస్ అటార్నీ అసిస్టెంట్ జాన్ లులెజియన్ కోర్టుకు తెలిపారు. కానీ, రానా పరిస్థితి వేరని, అతని నేరాన్ని అంగీకరించలేదని, దర్యాప్తులో అమెరికాతో సహకరించడమూ లేదని వివరించారు. అయితే, భారత్‌కు తరలించాలన్న విజ్ఞప్తిని అటార్నీ ఇంకా కోర్టులో దాఖలు చేయలేదు. త్వరలో చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Next Story