‘యారి రోడ్డులో నన్ను రేప్ చేశాడు’

by Sumithra |
‘యారి రోడ్డులో నన్ను రేప్ చేశాడు’
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ అత్యాచారం చేసినట్టు ముంబై‌లోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డు వద్ద కశ్యప్ లైంగిక దాడి చేశాడని.. నటి పాయల్ ఘోష్ తన లాయర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 376, 354, 341, 342 సెక్షల కింద అనురాగ్ కశ్యప్‌ కేసు నమోదయ్యింది. దీని పై తదుపరి విచారణ కొనసాగుతుండగా… ఈ లైంగిక ఆరోపణలు కశ్యప్ ఖండిస్తున్నాడు. అంతేకాకుండా.. బాలీవుడ్ ప్రముఖులు, అతడి మాజీ భార్య కూడా అనురాగ్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story