- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుశాంత్ ఆత్మహత్య.. ఆ డైరెక్టర్‌ను విచారించిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్యపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్‌లో యువ హీరోలను ఎదగనీయకుండా కొందరు అడ్డుపడతారన్న అరోపణలు వ్యక్తం అయ్యాయి. ఇందులో భాగంగా సుశాంత్ అభిమానులు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా సోమవారం సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణ కొన్ని గంటల పాటు సాగింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని మూడు రోజుల కిందే పోలీసులు సమన్లు పంపించారు. ఈ క్రమంలోనే జులై 27 మధ్యాహ్నం 11.30 గంటలకు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు మహేష్ భట్ వెళ్లాడు. అక్కడే డీసీపీ అభిషేక్ త్రిముఖి సమక్షంలో ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు.
సుశాంత్ ఆత్మహత్య కేసులో మహేష్ భట్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో మహేష్ భట్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడని, సుశాంత్ ఆత్మహత్యకు ఇది కూడా ఓ కారణం అంటూ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పాటే సుశాంత్ సింగ్ కచ్చితంగా ఏదో ఓ రోజు సూసైడ్ చేసుకుంటాడని గతంలో మహేష్ భట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది.
సడక్ 2 సినిమాకు సంబంధించి కూడా మహేశ్ భట్‌ను పోలీసులు విచారించారు. అసలు సడక్-2 కోసం సుశాంత్‌ను అనుకోలేదని చెప్పినట్టు పోలీసులు చెప్పారు. మహేష్ భట్‌తో పాటు కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జొహార్ మేనేజర్, ధర్మా ప్రొడక్షన్స్ సీఈవోను కూడా పోలీసులు విచారించనున్నారు. అవసరం అనుకుంటే కరణ్ జోహార్ కూడా పోలీసు విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.