ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 138

by Shyam |   ( Updated:2021-04-20 11:48:39.0  )
ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 138
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి స్కోరు బోర్డుకు బ్రేకులు వేశారు. ఇదే సమయంలో వికెట్లు కూడా తీసుకున్నారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (44) పరుగులతో రాణించినా.. మరో ఓపెనర్ డీ కాక్ (1) పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (24), ఇషాన్ కిషన్ (26) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు హార్దిక్ పాండ్యా (0), కృనాల్ పాండ్యా (1), కీరన్ పొలార్డ్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఇక 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జయంత్ యాదవ్ (23) పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. అప్పటికే 19 ఓవర్లు ముగిశాయి. ఇక చివరి ఓవర్‌లో రాహుల్ చాహర్ (6) పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా ( 3), ట్రెంట్ బోల్ట్ (1) పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లు పూర్తి కాగా.. ముంబై స్కోర్ 137 వద్ద ఆగిపోయింది. ఢిల్లీలో సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 4 వికెట్లు తీసుకోగా.. అవేశ్ ఖాన్ 2, స్టోయినిస్, రబాడ, లలిత్ యాదవ్‌లు తలో ఒక వికెట్ తీసుకున్నారు.

Advertisement

Next Story