- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్ 36వ మ్యాచ్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్ల బలాబలాలు..
డిఫెండింగ్ చాంపియన్ ఈ సీజన్‌లో మంచిగా రాణిస్తోంది. ఇప్పటికే 8 మ్యాచులు ఆడిన ముంబై 6 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో రెండింట్లో పరాజయం చెందింది. బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ శర్మ, డీకాక్, సూర్య కుమార్ యాదవ్‌తో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఇక మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్/కృనాల్ పాండ్యా ఓపెనర్లు విఫలమైతే జట్టును ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్ కూడా చాలా ధృడంగా ఉంది. వరల్డ్ ఫేమస్ బౌలర్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ పదునైన బంతులను సంధిస్తున్నారు.
ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఓపెనర్లు జట్టుకు చాలా బలంగా ఉన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన టాప్ 2 స్థానాల్లో పంజాబ్ ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ 448 తో నెంబర్ 1 గా ఉండగా.. నెంబర్ 2 స్థానంలో మయాంక్ అగర్వాల్ 382 పరుగులతో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
ఇక మిడిలార్డర్ విఫలంతోనే పంజాబ్ పరాజయాలు చెందింది. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లోనే గెలిచింది. మరో 6 మ్యాచుల్లో ఓటమిని చవి చూసింది.
అయితే, ఈ జట్టులో గేల్ రాకతో కాస్త బలం చేకూరిందని చెప్పాలి. మొన్నటి మ్యాచ్‌లో గేల్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతోనే పంజాబ్ గెలిచింది. ఈ రోజు కూడా గేల్ చెలరేగితే పంజాబ్‌కు విజయం లాంఛనమైనట్టే. ఇక బౌలింగ్ విషయానికొస్తే మహ్మద్ షమీ, కాట్రేస్ రాణిస్తున్నారు. మిగతా బౌలర్లు కూడా రాణించాల్సి ఉంది.