- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన RR..
ముంబై జట్టు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో RR ఆటగాళ్లు ఆదిలోనే చతికిల పడ్డారు. ముంబై బౌలర్ల ముప్పేట దాడికి మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఆర్‌ఆర్ టాప్ ఆర్డర్ ఒకరివెనుక మరొకరు పెవిలియన్ కు ‘క్యూ’ కట్టారు. రాయల్స్ జట్టులో ‘జోస్ బట్లర్’ తన పోరాట ప్రతిమతో జట్టును విజయతీరం చేర్చాలని ప్రయత్నించినా.. జేమ్స్ పాటిన్సన్ బౌటింగ్‌లో భారీ సిక్సర్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. చాలా ఎత్తులో వచ్చిన బంతిని బౌండరీ వద్ద పొలార్డ్ అందుకున్న తీరు మ్యాచ్ మొత్తానికే హై లైట్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కూలడంతో 10 వికెట్ల నష్టానికి రాజస్థాన్ జట్టు 139 పరుగులు చేసింది. దీంతో 57పరుగుల భారీ తేడాతో ముంబై మరో విజయాన్ని కైవసం చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: అబుదాబిలోని షేక్ జాయెద్ వేదికగా జరుగుతున్న 13వ Ipl సీజన్ 20వ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది. టార్గెట్ ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఆదిలోనే తడబడింది. లక్ష్య ఛేదనలో ఆర్‌ఆర్ కీలక ఆటగాళ్లు చెతులెత్తేశారు. దీంతో తొలి 3 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆర్‌ఆర్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.
RR ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 0(2) ఒక్క పరుగు చేయకుండానే డక్కౌట్‌గా వెనుదిరిగాడు. బౌల్ట్ బౌలింగ్‌లో కట్‌షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం RR కెప్టెన్ స్మిత్ (1.4) ఓవరల్లో 6 (7) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ (WK)కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. నాలుగో ప్లేస్‌లో బ్యాటింగ్ దిగిన సంజు శాంసన్ కూడా (2.5) ఓవర్లో o(3) డక్కౌట్ అయ్యాడు. మళ్లీ బౌల్ట్ బౌలింగ్‌లో బిగ్‌షాట్‌కు యత్నించి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఒకానొక సమయంలో 5 ఓవర్లు ముగిసే సమయానికి (30-3) పరుగులు చేసిన రాయల్స్ జట్టు.. తొలి స్ట్రాటజిక్ సమయం 8 ఓవర్లు ముగిసే సరికి (42-4) టాప్ ఆర్డర్ కూప్పకూలింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మహిపాల్ లామర్ 11(13) బిగ్‌షాట్‌కు యత్నించగా ఆ బంతిని అనుకుల్ (సబ్‌స్టిట్యూడ్) అందుకున్నాడు.
ఆర్‌ఆర్ జట్టును ఆదుకోవడంలో జోస్ బట్లర్ ఆది నుంచి తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సమయం దొరికినపుడల్లా బౌండరీలు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ కరన్ అయితే మొదటి బంతినే సిక్సర్‌గా మలిచి ముంబై ప్లేయర్లకు దడ పుట్టించాడు.వీరిద్దరూ కలిసి 84-4(12) స్కోర్ బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. అయితే 98-5 పరుగుల వద్ద బట్లర్ 70(44) పాటిన్సన్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత వెనువెంటనే టామ్‌కరన్ 15(16), రాహుల్ తెవాటియా 5(6) శ్రేయాస్ గోపాల్ 1(2), అంకిత్ రాజ్ పుత్ 2(5),అర్చర్ 24(11) పెవిలియన్ చేరారు. దీంతో ముంబై 57పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
Rajasthan Royals Innings: యశస్వి జైస్వాల్ c డీకాక్ b బోల్ట్ 0(2), జోస్ బట్లర్ (wk)c పొలార్డ్ b జేమ్స్ ప్యాటిన్సన్ 70(44), స్టీవ్ స్మిత్ (c)c డీకాక్ b బుమ్రా 6(7), సంజూ శాంసన్ c రోహిత్ b బోల్ట్ 0(3), మహిపాల్ లోమ్రాక్ (sub)అంకుల్ రాయ్ b రాహుల్ చాహర్ 11(13), టామ్ కుర్రాన్ c హార్దిక్ పాండ్యా b పొలార్డ్ 15(16), రాహుల్ తెవాతియా b బుమ్రా 5(6), జోఫ్రా ఆర్చర్ c పొలార్డ్ b బుమ్రా 24(11), శ్రేయస్ గోపాల్ c డీకాక్ b బుమ్రా 1(2), అంకిత్ రాజ్‌పుత్ c రోహిత్ b జేమ్స్ ప్యాటిన్సన్ 2(5), కార్తీక్ త్యాగి నాటౌట్ 00 ఎక్స్‌ట్రాలు 2 మొత్తం స్కోరు: 136/10
వికెట్ల పతనం: 0-1 (యశస్వి జైస్వాల్, 0.2), 7-2 (స్టీవ్ స్మిత్, 1.4), 12-3 (సంజు శాంసన్, 2.5), 42-4 (మహిపాల్ లోమ్రాక్, 8.1), 98-5 (జోస్ బట్లర్, 13.3) 108-6 (టామ్ కుర్రాన్, 14.4) 113-7 (రాహుల్ తెవాతియా, 15.2), 115-8 (శ్రేయస్ గోపాల్, 15.5). 136-9 (జోఫ్రా ఆర్చర్, 17.6), 136-10 (అంకిత్ రాజ్‌పుత్, 18.1).
బౌలర్లు: ట్రెంట్ బోల్ట్ 4-0-26-2, జస్ప్రీత్ బుమ్రా 4-0-20-4, జేమ్స్ ప్యాటిన్సన్ 3.1-0-19-2, రాహుల్ చాహర్ 3-0-24-1, కృనాల్ పాండ్యా 2-0-22-0, కిరాన్ పొలార్డ్ 2-0-24-1.
Mumbai Indians Innings: క్వింటాన్ డీకాక్ (wk)c జోస్ బట్లర్ b కార్తీక్ త్యాగి 23(15),
రోహిత్ శర్మ (c)c రాహుల్ తివాతెయా b శ్రేయస్ గోపాల్ 35(23), సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 79(47) ఇషాన్ కిషన్ c శాంసన్ b శ్రేయస్ గోపాల్ 0(1), కృనాల్ పాండ్యా c శ్రేయస్ గోపాల్ b జోఫ్రా ఆర్చర్ 12(17), హార్దిక్ పాండ్యా 30(19) ఎక్స్‌ట్రాలు 13, మొత్తం స్కోరు 193/4
వికెట్ల పతనం: 49-1 (క్వింటాన్ డీకాక్, 4.5), 88-2 (రోహిత్ శర్మ , 9.1), 88-3 (ఇషాన్ కిషన్, 9.2), 117-4 (కృనాల్ పాండ్యా, 13.6).
బౌలింగ్: అంకిత్ రాజ్‌పుత్ 3-0-42-0, శ్రేయస్ గోపాల్ 4-0-28-2, జోఫ్రా ఆర్చర్ 4-0-34-1, కార్తీక్ త్యాగి 4-0-36-1, టామ్ కుర్రాన్ 3-0-33-0, రాహుల్ తివాతెయా 2-0-13-0.