రో‘హిట్’షో.. ఐదోసారి కప్పుకొట్టిన ముంబై!

by Anukaran |   ( Updated:2020-11-10 12:18:59.0  )
రో‘హిట్’షో.. ఐదోసారి కప్పుకొట్టిన ముంబై!
X

దుబాయ్ వేదికగా జరుగుతున్న 13వ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ముంబై ఎదుట స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 68(51), ఇషాన్ కిషన్ 33(19), డికాక్ 20(12) చెలరేగి ఆడారు. దీంతో 18.4 ఓవర్లలోనే ముంబై జట్టు లక్ష్యాన్ని సులువుగా ఛేదించి ఐదోసారి కప్పును ముద్దాడింది.

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ తుదిపోరులో ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. టార్గెట్ తక్కువగా ఉండటంతో ముంబై ఓపెనర్లు ఫ్రీగా ఆడారు. క్వింటన్ డికాక్ 20(12) తొలుత మంచి ఆటతీరును కనబరిచినా త్వరగా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతితక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.అయితే, పదో ఓవర్లో రోహిత్ ఆడిన బంతికి పరుగు తీసే క్రమంలో యాదవ్ రన్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు. తక్కువ సమయంలో క్రీజులో నిలదొక్కుకున్నాడు.

కెప్టెన్ రోహిత్‌ 67(45) నార్తజే బౌలింగ్‌లో పెవిలియన్ చేరినా.. ఇషాన్ కిషన్ 33(19) వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ పరుగుల వరద పారించాడు. అనంతరం మిగతా ప్లేయర్లు త్వరగా పెవిలియన్ చేరినా, కిషన్ తనదైన ఫినిషింగ్ ఇచ్చాడు.దీంతో ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో సులభంగా ఛేదించింది. కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నైను ఓడించి విక్టరీ కొట్టినా ముంబై, ఈసారి ఢిల్లీని ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచింది. తాజా విజయంతో రోహిత్ ముంబై జట్టుకు ఐదోసారి ఐపీఎల్ కప్పును అందించగా.. ఫస్ట్ టైం ఢిల్లీ కాపిటల్స్ టీం రన్నరప్‌‌గా నిలిచింది.

స్కోరు బోర్డు :

Mumbai indians Innings : 157-5(20 Ov)

1. డికాక్ 20(12) c పంత్ WK b స్టోయినిస్
2. సూర్యకుమార్ యాదవ్ 19(20) రన్ ఔట్
3.రోహిత్ శర్మ 68(51) c లలిత్ యాదవ్ b నార్తజే
4.కిరోన్ పోలార్డ్ 9(4) b రబాడా
5.హార్దీక్ పాండ్యా c రహానే b నార్తజే

ఎక్స్‌ట్రాలు : 4

మొత్తం స్కోరు : 157

వికెట్ల పతనం : 45-1 (డికాక్, 4.1), 90-2 (సూర్యకుమార్ యాదవ్, 10.5) 137-3 (రోహిత్ శర్మ, 16.2), 147-4 (పొలార్డ్, 17.1), 156-5( హార్దిక్ పాండ్యా, 18.3)

బౌలింగ్ :

1. రవించంద్రన్ అశ్విన్ 4-0-28-0
2. కగిసో రబాడా 3-0-32-1
3. నార్తజే 2.4-0-25-2
4. స్టోనియిస్ 2-0-23-1
5. అక్సర్ పటేల్ 4-0-16-0
6.ప్రవీణ్ దుబే 3-0-29-0

Delhi capital Innings :156-7 (20 Ov)

1. స్టోయినిస్ 0(1) c డికాక్ b బౌల్ట్
2. శిఖర్ ధావన్ 15(13)b జయంత్ యాదవ్
3. అజింకా రహానే 2(04) c డికాక్ b బౌల్ట్
4. రిషబ్ పంత్ 56(38) c హార్దిక్ పాండ్యా b కౌల్టర్ నైల్
5. హిట్మయర్ 5(5) c కౌల్టర్ నైల్ b బౌల్ట్
5. అయ్యర్ నాటౌట్ 65(50)
6. అక్సర్ పటేల్ 9(9)c అనుకుల్ రాయ్ b కౌల్టర్ నైల్
7.రబాడా నాటౌట్ 0(0) రన్ ఔట్

ఎక్స్‌ట్రాలు : 4

మొత్తం స్కోరు : 156

వికెట్ల పతనం : 0-1 (స్టోయినిస్, 0.1), 16-2 (అజింకా రహానే, 2.4) 23-3 (శిఖర్ ధావన్, 3.3), 118-4 (రిషబ్ పంత్, 14.6), 137-5 ( హిట్మయర్, 17.2) 149-6 (అక్సర్ పటేల్ ,19.2) 156-7( రబాడా, 20)

బౌలింగ్ :

1.ట్రెంట్ బౌల్ట్ 4-0-30-3
2. బుమ్రా 4-0-28-0
3. జయంత్ యాదవ్ 4-0-25-1
4. కౌల్టర్ నైల్ 4-0-29-2
5. కృనాల్ పాండ్యా 3-0-30-0
6. కిరోన్ పొలార్డ్ 1-0-13-0

Advertisement

Next Story