- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాన్ స్వామి వర్క్‌పై గౌరవముంది: బాంబే హైకోర్టు
ముంబై: గిరిజన హక్కుల నేత, క్రైస్తవ మత గురువు ఫాదర్ స్టాన్ స్వామి ఓ గొప్ప వ్యక్తి అని, ఆయన చేసిన పనుల పట్ల కోర్టుకు అమితమైన గౌరవం ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బీమా కోరేగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదులపై ఆయన మరణాంతరం సోమవారం బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా బాంబే హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. జూలై 5న స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్.జే జమాదార్‌ల డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి సోమవారం వాదనలు విన్నది. స్టాన్ స్వామి(84) గుండెపోటుతో హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో మరణించారని హైకోర్టుకు తెలిపిన సమయంలో ఆయన చేసిన సేవలను హైకోర్టు ప్రశంసించింది.
‘సాధారణంగా మాకు సమయం ఉండదు. కానీ నేను స్వామి అంత్యక్రియలు చూశాను. ఆయన మంచి దయార్ద్ర హృదయం కలిగిన వ్యక్తి’అని జస్టిస్ షిండే తెలిపారు. ‘ఆయన గొప్ప వ్యక్తి. సమాజానికి ఆయన చేసిన సేవలు గొప్పవి. ఆయన సేవల పట్ల మాకు గౌరవం ఉంది. కానీ లీగల్‌గా ఆయనకు వ్యతిరేకంగా జరిగిన విషయం అంతా డిఫరెంట్ మ్యాటర్’అని జస్టిస్ షిండే అన్నారు. కాగా స్టాన్ స్వామి మరణానంతరం ఎన్ఐఏ, న్యాయవ్యవస్థలపై వెల్లువెత్తిన విమర్శలపై డివిజన్ బెంచ్ స్పందించింది.
పలు కేసుల్లో విచారణ ప్రారంభమయ్యే వరకు నిందితులు జైళ్లలో మగ్గిపోవడంపై విచారం వ్యక్తం చేసింది. స్టాన్ స్వామి బెయిల్ పిటిషన్‌తో పాటు ఎల్గార్ పరిషద్‌లో సహ నిందితుల పిటిషన్లపై కూడా ఉత్తర్వులు వెల్లడించే సమయంలోనూ స్వేచ్ఛాయుతంగా వ్యవహరిస్తామని వెల్లడించింది. ‘మీరు స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ పిటిషన్‌తో మే28న మా వద్దకు వచ్చారు. మీరు చేసిన అభ్యర్థనలను ప్రతి సారి సావధానంగా ఆలకించాము’అని స్టాన్ స్వామి తరఫు న్యాయవాదితో డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. గతంలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ కేసులో సహ నిందితుడు వరవరరావుకు బెయిల్ ఇచ్చామని గుర్తు చేసింది. కానీ స్టాన్ స్వామి విషయంలో ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని, దీనిపై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషన్‌పై కోర్టు వ్యాఖ్యానించింది.