బుమ్రా దెబ్బకు.. తల్ల‘ఢిల్లీ’!

by Anukaran |
బుమ్రా దెబ్బకు.. తల్ల‘ఢిల్లీ’!
X

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ముంబై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ ఓపెనర్లు కుప్పకూలారు. సున్నా పరుగుల వద్ద ముగ్గురు కీలక ఆటగాళ్లు డక్కౌట్ కావడంతో రోహిత్ సేన గెలుపు నల్లేరు మీద నడకే అయింది. ఢిల్లీ జట్టులో మార్కస్ స్టోనిస్ 65(46) అక్సర్ పటేల్ 42(33) మినహా ఎవరూ ఆశించినంతగా రాణించలేదు. దీంతో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నిర్దేశించిన 201 పరుగుల ఛేదనలో శ్రేయస్ అయ్యర్ సేన ఆదిలోనే తడపడింది. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా విసిరిన అద్భుతమైన బంతులకు ఢిల్లీ ఓపెనర్లు మూకుమ్మడిగా వికెట్లు సమర్పించకున్నారు. సున్నా పరుగుల వద్ద పృథ్వీ షా,(0.2), అజింకా రహానే(0.5) శిఖర్ ధావన్(0.2) ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో ఢిల్లీకి ఊహించని షాక్ తగిలింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. మూడో ఓవర్లో బుమ్రా వేసిన బంతిని షాట్ ఆడబోయి రోహిత్‌కు దొరికిపోయాడు.దీంతో ఢిల్లీ జట్టు 20-4 (3.5) టాప్ ఆర్డర్ కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది. ఇదిలాఉండగా, ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మార్కస్ స్టోనిస్ మాత్రం జట్టును గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. వచ్చిన ప్లేయర్లు వచ్చినట్లే వెనుదిరుగుతున్న తాను మాత్రం క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టడమే లక్ష్యంగా చెలరేగి ఆడాడు. దీంతో 37 బంతుల్లోనే 51పరుగులు చేసి పరావాలేదని పించాడు.

అయితే, ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 3 (9)కూడా నిరాశపరిచాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఢిల్లీ జట్టును అక్సర్ పటేల్, మార్కస్ స్టోనిస్ తిరిగి గాఢీన పెట్టారు. వీరిద్దరూ కలిసి స్కోర్ బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. అయితే, 15ఓవర్లో బుమ్రా వేసిన బంతికి స్టోనిస్ 65(46) బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ కథ మళ్లీ మొదటికే వచ్చింది.

చివరాఖర్లో రబాడా తోడ్పాటుతో అక్సర్ పటేల్ పరుగుల సాధనకు యత్నించినా అది వర్కౌట్ కాలేదు. ముంబై విధించిన 201 లక్ష్య ఛేదనలో ఢిల్లీ ప్లేయర్లు చేతులెత్తేశారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 143 స్కోర్ మాత్రమే చేయగలిగింది. క్వాలిఫైయింగ్ మ్యాచులో ముంబై బౌలర్లు విజృంభించడం వలన రోహిత్ సేన సులువుగా విజయాన్ని కైవసం చేసుకుంది.

స్కోరుబోర్డు:

delhi capital innings : 143-8(20 Over)

1. పృథ్వీ షా 0(2)c డికాక్ b ట్రెంట్ బౌల్ట్
2. శిఖర్ ధావన్ 0(2) b బుమ్రా
3. అజింకా రహానే 0(3) lbw b ట్రెంట్ బౌల్ట్
4. శ్రేయస్ అయ్యర్ 12(8)c రోహిత్ b బుమ్రా
5. రిషబ్ పంత్ 3(9)c సూర్యకుమార్ యాదవ్ b కృనాల్ పాండ్యా
6. స్టోనియిస్ 65(46) b బుమ్రా
7. డానియల్ సామ్స్ 0(2) b బుమ్రా
8.అక్సర్ పటేల్ 42(33)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 143

వికెట్ల పతనం: 0-1 (పృథ్వీ షా, 0.2), 0-2 (అజింకా రహానే, 0.5) 0-3 ( శిఖర్ ధావన్, 1.2), 20-4 (శ్రేయస్ అయ్యర్, 3.5) 41-5(రిషబ్ పంత్, 7.5)112-6 (మార్కస్ స్టోనియిస్, 15.1) 112-7 డానియల్ సామ్స్ (15.3), 141-8 (అక్సర్ పటేల్,19.5)

బౌలింగ్:

1. ట్రెంట్ బౌల్ట్ 2-1-9-2
2. బుమ్రా 4-0-14-4
3. కృనాల్ పాండ్యా 4-0-22-1
4. కౌల్టర్ నైల్ 4-0-27-0
5. పొలార్డ్ 4-0-36-1
6. రాహుల్ చాహార్ 2-0-35-0

Mumbai indians innings : 200-5(20 Over)

1.రోహిత్ శర్మ 0(1)(c)lbw b అశ్విన్
2. డికాక్ 40(25) c దావన్ b అశ్విన్
3. సూర్యకుమార్ యాదవ్ 51(38) c డానియల్ b నార్తజే
4. పోలార్డ్ 0(2)c రబాడా b అశ్విన్
5. కృనాల్ పాండ్యా 13(10)c డానియల్ b స్టోనిస్
6.ఇషాన్ కిషన్ 55(30) నాటౌట్,
7.హార్దిక్ పాండ్యా 37(14)నాటౌట్

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 200

వికెట్ల పతనం: 16-1 (రోహిత్ శర్మ, 1.3), 78-2 (డికాక్, 7.4) 100-3 ( సూర్యకుమార్ యాదవ్, 11.5), 101-4 (పొలార్డ్ , 12.2) 140-5(కృనాల్ పాండ్యా, 16.1)

బౌలింగ్:

1. డానియెల్ సామ్స్ 4-0-44-0
2. రవిచంద్రన్ అశ్విన్ 4-0-29-3
3. రబాడా 4-0-42-0
4. అక్సర్ పటేల్ 3-0-27-0
5. నార్త్ జే 4-0-50-1
6.స్టోనిస్ 1-0-5-1

Advertisement

Next Story