మహిళా ఆటోడ్రైవర్.. ఉచిత సేవ!

by vinod kumar |
మహిళా ఆటోడ్రైవర్.. ఉచిత సేవ!
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కారణంగా ఎంతోమంది తమ ఉపాధిని కోల్పోయారు. ఉబర్, ఓలా లాంటి సంస్థలే నష్టాలు తట్టుకోలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్నాయి. ఇక ఆటో రిక్షాల డ్రైవర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ముంబైలో అయితే.. ప్రతి ఆటో డ్రైవర్ కు పదివేలు ప్రభుత్వం ఇవ్వాలంటూ ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళా ఆటో డ్రైవర్ .. ముంబై మహానగరంలో ఉచిత సేవలు అందించడం ఎంతో అభినందనీయమని ముంబై వాసులు అంటున్నారు. ఇటువంటి ఆపత్కాలంలో కడుపు గురించి ఆలోచించ కుండా తోటి మనిషి గురించి ఆలోచించి ఆమె ఈ పని చేస్తోంది. ఆ ధీరురాలే పేరే ‘శీతల్ సరోడే’

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అందులోనూ మన దేశంలో ముంబై నగరాన.. కరోనా ఉదృతి ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటకు రావడమే ఎంతో సాహసం. అలాంటిది లాక్టౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఉచితంగా ఆటో నడపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది శీతల్ సరోడే. ‘నేను ముంబైలోని ఘట్ కోపర్ లో ఉంటాను. ప్రజలు రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అత్యవసర సేవలు అవసరమవుతాయి. అలాంటి వారికి సాయం అందిస్తున్నాను. ఇదంతా డబ్బులు కోసం చేయడం లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను. కఠినమైన పరిస్థితుల్లో కొంతమందికైనా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఎవరికైనా ఫుడ్ అందించాలి ఉన్న.. నేను తీసుకువెళ్లి అందిస్తాను’ అని శీతల్ పేర్కొన్నారు. ముంబై వాసులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తున్నారు.

tags : corona virus, lockdown, mumbai, auto driver, shital sarode

Advertisement

Next Story

Most Viewed