- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైపర్ల ధరదడ.. కన్నీరు పెట్టిన తల్లి
కరోనా వైరస్ ప్రభావంతో మొన్నటి వరకు మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకున్నారు. ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నారు. కేవలం రూ.40 ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200 విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రజలంతా భయపడుతున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు ప్రజల భయాన్ని, అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ డైపర్లు కొనేందుకు స్టోర్ కు వెళితే.. వ్యాపారులు చెప్పిన ధర విని షాక్ తిన్నది.
ఓ వైపు కరోనా భయం.. మరోవైపు బయటకు వెళ్లి ఏమైనా తెచ్చుకుందామంటే ఐదు రెట్లు పెంచేసిన ధరలు చూసి భయం. కరోనా ఎఫెక్ట్ సామాన్యులపై చాలా ఘోరంగా ఉందనడానికి తాజా ఘటనే నిదర్శనం.
లారెన్ విట్నీ అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి దక్షిణ ఊతాలో నివసిస్తున్నారు. తన బేబీకి డైపర్లు కొనేందుకు స్టోర్ కు వెళ్లగా.. అక్కడ వాళ్లు చెప్పిన ధర విని ఆమె షాక్‌కు గురయ్యింది. ఒక్కో డైపర్ ప్యాకెట్ ధర 20 రెట్లు పెరిగిందని.. తను అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేనని.. తన బిడ్డకు డైపర్లు ఎలా మార్చాలో అర్థంకావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేశారు. నెటిజన్లు లారెన్‌పై సానూభూతి వ్యక్తం చేస్తూ.. కరోనా భయాన్ని వ్యాపారులు ఇలా వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.
Tags : america, mask, coronavirus, diapers, lauren whitney, price