- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్ టబ్‌లో మునకలేసే ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్ : శీతాకాలంతో పాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎక్కువమంది ప్రిఫర్ చేసే డ్రింక్ ‘మల్లేడ్ వైన్’. రెడ్ వైన్‌కు పలు రకాల సుగంధ ద్రవ్యాలు, ఎండుద్రాక్ష కలిపి తయారు చేసే ఈ సంప్రదాయ వైన్‌నే ‘స్పైస్డ్ వైన్ (సుగంధ ద్రవ్యాల వైన్) అని పిలుస్తారు. ఇది జలుబును నివారించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంగ్లాండ్, ‘చెషైర్’ సిటీలోని ష్రిగ్లే హాల్ హోటల్ నిర్వాహకులు ఓ వినూత్న ఆలోచనతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ కస్టమర్లకు ‘కిక్కిచ్చే’ స్పా ఆఫర్ ఇస్తున్నారు. ‘వైన్’లో మునకలేసే ఆ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలనుందా?
బ్రిటన్‌కు చెందిన ష్రిగ్లే హోటల్ నిర్వాహకులు ప్రపంచంలోనే తొలిసారి ‘మల్లేడ్ వైన్ టబ్’ను తమ హోటల్ స్పా సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఆ వైన్ టబ్‌ను 750- 1000 లీటర్ల మల్లేడ్ వైన్‌తో నింపారు. ఇది 560 వైన్ బాటిళ్లతో సమానం. క్రిస్మస్ ఫెస్టివ్ సందర్భంగా స్పా కోసం వచ్చే కస్టమర్లకు సరికొత్త అనుభూతినివ్వడానికి ఈ వైన్ టబ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా స్పా కోసం వచ్చే వినియోగదారులకు వేడినీటిలో లేదా ఆవిరితో స్పా చేస్తారు. ఇక్కడ మాత్రం 37డిగ్రీల వరకు వేడి చేసిన వైన్‌లో హ్యాపీగా మునకలేసే అవకాశం కల్పించడంతో పాటు కస్టమర్లు ఎంపిక చేసుకున్న స్పా ట్రీట్‌మెంట్స్ కూడా అందిస్తోంది.
దాంతో పాటు కాంప్లిమెంటరీగా మల్లేడ్ వైన్ తాగేందుకు అవకాశమిచ్చింది. మల్లేడ్ వైన్ తయారీలో రెడ్ వైన్, ఆరెంజెస్, సినామిన్, స్టార్ అనైస్‌లను ఉపయోగించినట్లు తెలిపారు. ఇది యాంటి ఆక్సిడైజింగ్, యాంటి బ్యాక్టీరియల్, స్ట్రెస్ రెడ్యూసింగ్, స్కిన్ సాఫ్టెనింగ్, యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అంతేకాదు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్త ప్రసరణ కూడా సాఫీగా సాగుతుందంటున్నారు. వైన్ టబ్‌లో 45 నిముషాల పాటు మాత్రమే ఉండొచ్చని, ఈ సేవలు వినియోగించుకోవడానికి హోటల్ వెబ్‌సైట్‌లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా కనీస ధర 60 యూరోల ( రూ. 6 వేలు) నుంచి ప్రారంభమవుతోంది.