- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశాంతంగా చావనివ్వరా..? : శక్తిమాన్ ఎమోషనల్ వీడియో
దిశ, సినిమా : శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా.. తను చనిపోయినట్టు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యాడు. ఇది సెన్సేషనల్ మ్యాటర్ కాదు, సెన్సిటివ్ మ్యాటర్ అన్న ముఖేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో మెసేజ్ పెట్టాడు. వ్యూయర్‌షిప్ కోసం ఇలాంటి ఆటలు ఆడేందుకు బుద్ధిలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీ ఇంట్లో అమ్మానాన్న, అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు ఉన్నారు కదా.. ఇలాంటి న్యూస్ తెలిస్తే బంధువులు, ఆప్తులు ఎంత షాక్ అవుతారో తెలియదా?’ అని ప్రశ్నించాడు. యాక్టర్స్ గురించి ఇలాంటి తప్పుడు న్యూస్ రాస్తే మహా అంటే సోషల్ మీడియా ఎకౌంట్ వ్యూస్ పెరుగుతాయి అంతే కదా? అన్న ముఖేష్.. ‘మీలాంటి వారిని బయటకు లాగుతా, పోలీస్ యాక్షన్ తీసుకుంటా’ అని హెచ్చరించాడు. మనసాక్షి, సున్నితతత్వం కొంచెం ఉన్నా ఇలాంటి పనులు చేయరన్న ఆయన.. మనుషుల చావనేది వీడియో గేమ్ కాదు, శక్తిమాన్ మిమ్మల్ని తీసుకెళ్లి అంతరిక్షంలో పడేసినా అడిగేవారుండరు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.