రెండో అతిపెద్ద చమురు సంస్థగా రిలయన్స్

by Shyam |   ( Updated:2020-07-27 05:37:39.0  )
రెండో అతిపెద్ద చమురు సంస్థగా రిలయన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు సంస్థగా ఎదిగింది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధంగా ఉన్న రిటైల్, డిజిటల్ విభాగాలు వేగంగా విస్తరిస్తుండటంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరిగింది.

గత వారాంతంలో కంపెనీ విలువ 189 బిలియన్లను తాకడంతో.. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ కంపెనీని దాటి రిలయన్స్ సంస్థ దూసుకెళ్లింది. ఈ రెండు కంపెనీల మధ్య ఒక బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది. చమురుకు డిమాండ్ తగ్గిపోతుండటంతో ఈ ఏడాదిలో ఎక్సాన్ విలువ 39 శాతం దిగజారింది. ప్రస్తుతం చమురు డిమాండ్ తగ్గుదల రోజుకు 30 మిలియన్ బ్యారెళ్లు ఉంది. చమురుకు డిమాండ్ తగ్గిపోవడంతో ఎక్సాన్ కంపెనీపై ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ విభాగం లాభాలు తగ్గినప్పటికీ, రిటైల్, డిజిటల్ వ్యాపారంలో ఆదాయం కాపాడింది. మార్చి చివరి నాటికి రిలయన్స్ ఆదాయంలో 80 శాతం పెట్రోలియం నుంచే ఆదాయం వచ్చింది.

Advertisement

Next Story