ముధోల్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. 2 గంటలు కదలకుండా వర్షంలోనే..!

by Aamani |   ( Updated:2023-09-01 16:03:11.0  )
mudhol-mla
X

దిశ, ముధోల్ : భైంసా మండలంలో నీట మునిగిన గుండేగాం గ్రామాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత పదేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించే వరకు ఊరు విడిచి వెళ్ళొద్దని, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నలతో ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో గుండేగాం నీట మునిగింది. ఈ ఘటనలో సుమారు 300 ఇళ్లు నీట మునిగాక గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story