సినిమాపై అంచనాలు పెంచేసిన ‘మడ్డీ’ టీజర్..

by Jakkula Samataha |   ( Updated:2023-09-12 04:49:37.0  )
సినిమాపై అంచనాలు పెంచేసిన ‘మడ్డీ’ టీజర్..
X

దిశ, సినిమా : ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీగా రూపొందుతున్న చిత్రం ‘మడ్డీ’. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న సినిమా ద్వారా డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు వెర్షన్ టీజర్‌ను అనిల్ రావిపూడి రిలీజ్ చేయగా.. థ్రిల్లింగ్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అంటున్నారు ఆడియన్స్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సినిమా.. బురదలో సాగే రేసింగ్‌తో సాహసోపేతంగా ఉండనుండగా, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దర్శకుడికి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుంచి మడ్డీ కథ పుట్టుకురాగా.. ఐదేళ్లపాటు సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. అంతేకాదు లీడ్ యాక్టర్స్‌కు రెండేళ్ల పాటు ఆఫ్ రోడ్ రేసింగ్‌లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆర్టిస్టులు సైతం డూప్‌ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టంట్స్ చేయగా.. మూడు విభిన్న తరహా మడ్ రేసింగ్‌లతో సినిమాను డిజైన్ చేశారు.

Advertisement

Next Story