‘7 డేస్ 6 నైట్స్’ ఎంజాయ్ చేయనున్న హీరోహీరోయిన్లు

by Shyam |
‘7 డేస్ 6 నైట్స్’ ఎంజాయ్ చేయనున్న హీరోహీరోయిన్లు
X

దిశ, సినిమా: తెలుగు సినీపరిశ్రమకు నిర్మాతగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఎంఎస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. కాగా తన సెకండ్ డైరెక్టోరియల్ వెంచర్ ‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ ఈ నెల 21న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పదిహేనేళ్ల కుర్రాడు సమర్థ్ గొల్లపూడిని ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయపోతున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుండగా.. జూలై 10వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ సాగుతుందన్నారు. ఆ తర్వాత జూలై 15 నుంచి నెలరోజుల పాటు గోవా, మంగళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చెప్పారు హీరో సుమంత్ అశ్విన్. సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఎస్ రాజు.. ‘7 డేస్ 6 నైట్స్’ అనేది కూల్ అండ్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ అని తెలిపారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నామని, త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Next Story