- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీకి డీఆర్ఎస్ ఇష్టం ఉండదు: ఆకాశ్ చోప్రా
దిశ, స్పోర్ట్స్: డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)ను భారత మాజీ కెప్టెన్ ధోనీ ఉపయోగించినంతగా మరెవరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. అతడు ఫీల్డ్‌లో డీఆర్ఎస్ తీసుకున్న సమయాల్లో 90శాతం విజయం సాధించాడు. అందుకే అభిమానులు డీఆర్ఎస్‌ను ముద్దుగా ధోనీ రివ్యూ సిస్టమ్ అని వ్యవహరిస్తుంటారు. కాగా, ధోనీకి అసలు డీఆర్ఎస్ పెట్టడం ఇష్టం లేదని క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ఒక బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టు 2008లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ తొలిసారి అమలు చేసింది. అప్పుడు కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో అది కొత్త సాంకేతికత కావడంతో భారత జట్టు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అందుకే చాలా కాలంపాటు బీసీసీఐ డీఆర్ఎస్‌ను వ్యతిరేకించింది. ధోనీకి కూడా డీఆర్ఎస్ వాడటం ఇష్టం లేదు. కానీ, ఆటలో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అత్యంత విజయవంతంగా ఉపయోగించుకుంది ధోనీనే. ప్రతీ 10 సమీక్షల్లో 9 అతడివి విజయవంతమయ్యాయి. ధోనీకి నచ్చకపోవడంతోనే మొదట్లో బీసీసీఐ డీఆర్ఎస్‌ను వ్యతిరేకించింది. కానీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం డీఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ ప్రతీ దాంట్లో డీఆర్ఎస్ ఉండాలని అతడు కోరుకుంటాడు’ అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.