- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ధోని కెప్టెన్సీ డుప్లెసిస్‌కు అప్పగింత: సంజర్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైంది. దీంతో జట్టు ప్రక్షాళనపై పలువురు సీనియర్ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. వచ్చే ఏడాది చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకొని డు ప్లెసిస్‌కి అప్పగించే అవకాశాలు ఉన్నాయని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజర్ బంగర్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలసి ‘క్రికెట్ కనెక్టెడ్’ అనే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ధోనీ తన బాధ్యతలను డు ప్లెసిస్‌కి అప్పగించి అతను కేవలం ఒక సభ్యుడిగా చెన్నైలో కొనసాగుతాడు’ అని అభిప్రాయపడ్డాడు. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ ‘నాకైతే అలా అనిపించడం లేదు. ధోని తిరిగి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సంపాదించి ఐపీఎల్‌లో ఆడతాడు. అంతకంటే ముందే అతడు క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నది. అతడిని తిరిగి మైదానంలో చూడాలని అనుకుంటున్నాను’ అని అన్నాడు. కాగా, 2011 వరల్డ్ కప్ తర్వాతే ధోని కెప్టెన్‌గా దిగిపోవాలని భావించి ఉంటాడని.. కానీ సరైన ఆటగాడు కనిపించనందువల్లే ఆ ఆలోచన విరమించుకొని ఉంటాడని బంగర్ అన్నాడు.