- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అహ్మదాబాద్‌లో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమి
దిశ, స్పోర్ట్స్ : అర్కా స్పోర్ట్స్, శ్రీ అకాడమీ సంయుక్తంగా అహ్మదాబాద్‌లో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమిని ప్రారంభించాయి. ఎంఎస్ ధోనీ, ఆయన మేనేజర్ మిహిర్ దివాకర్ కలసి ఆర్కా స్పోర్ట్స్ ను నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమిలు ఆర్కా స్పోర్ట్స్ ప్రారంభిస్తున్నది. దీనిలో భాగంగానే సోమవారం అహ్మదాబాద్‌లో క్రికెట్ అకాడమిని ప్రారంభించాయి. ఇండియాతో పాటు రాబోయే రోజుల్లో విదేశాల్లో కూడా ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమిలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఆర్కా స్పోర్ట్స్ తెలియజేసింది.
ఈ అకాడమీలో సరికొత్త టెక్నాలజీ, అత్యుత్తమ కోచ్‌లతో క్రికెట్‌లో శిక్షణ అందిస్తారు. శిక్షణ పొందుతున్న క్రికెటర్లకు ప్రాక్టికల్ ఈవెంట్లు కూడా నిర్వహిస్తామని.. అలాగే ప్రతీ క్రీడాకారుడి మానసిక స్థితిపై కూడా దృష్టిపెడతామని శ్రీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేవలం నెట్ ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం కాకుండా మ్యాచ్‌లు ఆడించడం, ఒత్తిడి అధిగమించడం వంటివి ప్రాక్టికల్‌గా నేర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అహ్మదాబాద్‌లోని ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమి కోసం రిజస్ట్రేషన్లు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.