ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. పిక్స్ వైరల్

by Shyam |   ( Updated:2021-11-17 10:44:53.0  )
mrunal
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. యూనిక్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ రోల్స్, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో క్రేజ్ సంపాదించింది. ఈ మేరకు త్వరలోనే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ‘ధమాకా’ మూవీతో ఎంటర్‌టైన్ చేయనున్న మృణాల్.. అంతకుముందు ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌తో పాపులరైన సంగతి తెలిసిందే. అందులో బుల్‌బుల్‌గా మెప్పించిన ఆమె.. ఆ సీరియల్ నుంచి తప్పుకున్నా సరే, కోస్టార్స్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగించింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో తనకు పార్ట్‌నర్‌గా కనిపించిన అర్జిత్ తనేజాతో ప్రస్తుతం సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

రీల్ స్క్రీన్‌పై మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన వీరిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ జీవితాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నారని ‘పీపింగ్‌మూన్. కమ్’ అనే హిందీ వెబ్‌సైట్ కన్‌ఫర్మ్ చేసింది. అయితే మృణాల్, అర్జిత్ మాత్రం ఈ విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నారని, తమ లవ్‌ను అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేసేందుకు సిద్ధంగా లేరని తెలిపింది.

నాకు అక్కడ ముద్దుపెట్టండి.. హాట్ ఫొటోస్‌తో రెచ్చిపోయిన బ్రిట్నీ..

Advertisement

Next Story

Most Viewed