- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర అమ్మాయినే.. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు : మృణాల్
దిశ, సినిమా : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ‘తుఫాన్’ సినిమా ద్వారా మరోసారి స్ట్రాంగ్ క్యారెక్టర్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో సైక్రియార్టిస్ట్ అనన్యగా నటించిన మృణాల్.. అజ్జీ అనే గ్యాంగ్‌స్టర్‌ను బాక్సర్ అజీజ్ అలీగా ఎలా మార్చగలిగిందనేది తన రోల్. ‘రంగ్ దే బసంతి’, ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి చిత్రాల దర్శకులు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ఇంత గొప్ప క్యారెక్టర్ సొంతం చేసుకోవడం కల నిజమైనట్లు చెబుతూ.. దాదాపు 15సినిమాల తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందనుకున్నా, కానీ కెరియర్ ఆరంభంలోనే రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.
అలాగే నిఖిల్ అద్వానీ డైరెక్షన్‌లో వచ్చిన ‘బట్లా హౌజ్’ డబ్బింగ్ సమయంలో మెహ్రాను కలిసినపుడే ‘తుఫాన్’ గురించి తనతో డిస్కస్ చేశారని తెలిపింది. ఆయన నాపై చూపిస్తున్న నమ్మకం సర్‌ప్రైజ్ అయ్యేలా చేసిందన్న మృణాల్.. తను మహారాష్ట్రకు చెందిన అమ్మాయినని డైరెక్టర్‌కు తెలియదని, కానీ మూవీలో క్యారెక్టర్ అదేనని తెలిపింది. అయినా సరే రోల్ ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు కాబట్టి ఇందుకోసం కష్టపడాల్సిన అవసరం ఉందని, ఇప్పటి వరకు తనకు లభించిన అతిపెద్ద పాత్రల్లో ఇదీ ఒకటి కాగా.. అనన్య క్యారెక్టర్ ప్లే చేయడం లక్కీ అని వివరించింది.