పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

by Shyam |
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
X

దిశ, వరంగల్: పారిశుధ్య కార్మికులను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శుక్రవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 56, 58 డివిజన్ పరిధిలోని కార్మికులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విధి నిర్వహణలో నిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారి సేవలను కొనియాడారు.అంతేకాకుండా ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇస్తున్నాదా లేదా అనే విషయంపై ఆరా తీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి‌ ఆదుకోవాలన్నారు.కార్మికుల‌ తరఫున పోరాటం చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, రాష్ట్ర నాయకులు కొండేటి సారంగపాణి, నాయకులు ఈరెల్లి శ్రీనివాస్, చిన్నపెళ్లి రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed