తహసీల్దార్‌ను బలిగొన్న కరోనా…

by Sumithra |
తహసీల్దార్‌ను బలిగొన్న కరోనా…
X

దిశ,మునుగోడు: కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను అల్లకల్లోలం చేస్తుంది. ఏ క్షణాన ఏ కుటుంబాన్ని కరోనా మహమ్మారి కబలిస్తుందో అంతుచిక్కడం లేదు. తాజాగా శనివారం మునుగోడు తహసీల్దార్ సునంద కరోనా బారినపడి మృతి చెందారు. గతంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన సునంద, ప్రమోషన్ పై ఈ ఏడాది ఫిబ్రవరి 13న మునుగోడు తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.

గత 25 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సునంద, శనివారం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం. మునుగోడు తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అతికొద్ది రోజుల్లోనే ఆమె మరణించడం బాధాకరమని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed