జగిత్యాలలో బ్లాక్ ఫంగస్ కలకలం.. తొలి మరణం నమోదు

by Sridhar Babu |
black fungus
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా జగిత్యాలలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. జిల్లాలోని మేడిపల్లి తహసీల్దార్ ఏ.రాజేశ్వర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నెలరోజుల క్రితం కరోనా చికిత్స నిమిత్తం రాజేశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకింది. దీంతో రాజేశ్వర్ చికిత్స కోసం మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Advertisement

Next Story

Most Viewed