- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎప్పుడు ఏ కార్యాలయాన్ని తనిఖీ చేస్తానో.. నాకే తెలియదు
దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రగతిని పరుగులు పెట్టిస్తానని, ఏ సమయంలో ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానో నాకే తెలియదని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. తనిఖీ చేసిన క్రమంలో అలసత్వం వహించినా, పారిశుధ్యం లోపించినా, అధికారులు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోమవారం బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంఈఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశీలించి వెంటనే తొలగించి మొక్కలు నాటాలని ఆదేశించారు. సిబ్బంది వివరాలను, రికార్డులను పరిశీలించారు.
కార్యాలయం ఎదుట ఉన్న దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదని గ్రహించిన కలెక్టర్ వారికి నోటీసులు అందజేయాలని ఆదేశించారు. కార్యాలయాల ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఎమ్మార్వో కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధురాలి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.