వాజ్‌పేయి వైద్యుడికి కరువైన వైద్యం

by Shamantha N |
వాజ్‌పేయి వైద్యుడికి కరువైన వైద్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం సృష్టిస్తుండగా.. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, ఉన్నతాధికారులు కూడా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తుండగా.. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు.

అయితే మాజీ ప్రధాని వాజ్‌పేయి బ్రతికి ఉన్న సమయంలో ఆయన దగ్గర ఎన్నో ఏళ్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్టర్.కె షా(65)కు హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్ దొరకకపోవడం చూస్తుంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా.. ఆక్సిజన్ లెవల్స్ 75కు పడిపోయాయి. ఐసీయూ బెడ్ దొరకకపోవడంతో.. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన భార్య నిన్న కరోనాతో మరణించింది

Advertisement

Next Story

Most Viewed