కరోనాను జయించిన ఎంపీడీవో.. అనుకోకుండా..!

by Sumithra |
కరోనాను జయించిన ఎంపీడీవో.. అనుకోకుండా..!
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి ఎంపీడీఓగా ఇటీవల బదిలీపై వచ్చిన అశోక్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు.

సోమవారం రాత్రి కామారెడ్డిలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటుకు రావడంతో మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. మంగళవారం ఆయన స్వగ్రామం తాడ్వాయి మండలం సంతాయిపేట్‌లో అంత్యక్రియలు పూర్తిచేశారు. అశోక్ మృతి పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story