డ్రైవర్ నిర్లక్ష్యం..ఎంపీడీవోకు తప్పిన ప్రమాదం

by Sumithra |
డ్రైవర్ నిర్లక్ష్యం..ఎంపీడీవోకు తప్పిన ప్రమాదం
X

దిశ, నల్లగొండ : డ్రైవర్ నిర్లక్ష్యం వలన చింతలపాలెం ఎంపీడీవో బానావత్ గ్యామాకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన గూడ్స్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి చెరువు వద్ద చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా మిర్యాలగూడ నుంచి చింతలపాలెంకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఎంపీడీవో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించ లేదు.

Advertisement

Next Story