రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలకు మహార్దశ: ఎంపీపీ సునీత

by Shyam |   ( Updated:2021-12-23 05:48:33.0  )
రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలకు మహార్దశ: ఎంపీపీ సునీత
X

దిశ, నల్లబెల్లి: వాడ వాడలా సీసీ రోడ్లు నిర్మించడం వల్లే గ్రామాలకు మహార్దశ పడుతుందని ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ అన్నారు. గురువారం నారక్కపేట గ్రామంలో 5 లక్షల ఎంపీటీసీ నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీటీసీలు అందరూ కృషి చేస్తున్నారని ఎంపీపీ కొనియాడారు.

అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వసతుల గురించి తెలుసుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వక్కల మల్లక్క, ఎంపీటీసీ ఓదెలా విజయ లక్ష్మి, పీ.ఏ.సీ.ఎస్ డైరెక్టర్ చెన్నమల్ల నర్సయ్య, వక్కల చంద్రమౌళి, వార్డు సభ్యులు శారద, సుగుణ, ఆర్.ఎస్.ఏస్ గ్రామ కోఆర్డినేటర్ వైనాల రమేష్, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగితపు రాజేంద్రచారి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed