ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం.. రైతన్నలకు సెల్యూట్ : రేవంత్​రెడ్డి

by Shyam |
ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం.. రైతన్నలకు సెల్యూట్ : రేవంత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికి అన్నం పెట్టే రైతులపై ఢిల్లీలో దాడి జరగడం అమానుషమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులపై జరిగిన దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంగళవారం ట్విట్టర్‌లో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడితో మోడీ, అమిత్‌షా జోడి పతనానికి నాంది అని, దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించిందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రైతుల హక్కులను కాలరాశారని, ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతన్నలకు సెల్యూట్ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికైనా నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్​ వేదికగా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story