- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల గారు.. ఇవ్వేం లెక్కలు : రేవంత్ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా హెల్త్ బులిటెన్‌పై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. నిర్దారణ అవుతున్న కేసులకు, ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌కు ఏమాత్రం పొంతన లేదని పలువురు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి సరైన లెక్కలు చూపించడం లేదని విపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి. అటు హైకోర్టు సైతం పలుమార్లు మొట్టి కాయలు వేసింది. కరోనా కేసుల వివరాల్లో స్పష్టత లేదని.. కాకి లెక్కలు చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కేసుల గందరగోళంపై ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తప్పుడు లెక్కలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని.. ఆధారాలను బయటపెట్టారు.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం రాత్రి వరకు రాష్ట్రంలో 18570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డ్యాష్ బోర్డులో మాత్రం 21393 కేసులు చూపిస్తున్నారు. తెలంగాణ కరోనా కేసుల విషయంలో రెండు సెట్లు ఉన్నాయని.. జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ఎంపీ రేవంత్ ట్వీట్ రెడ్డి చేశారు. మీడియా బులెటిన్‌లో చెప్పిన లెక్కలకు, డ్యాష్ బోర్డులో ఉన్న లెక్కలకు ఏకంగా 3 వేలు తేడా ఉందని ఆయన విమర్శించారు. ఇందులో ఏది నిజమని? ప్రజలు దేనిని విశ్వసించాలని ప్రశ్నించారు. కరోనా కేసుల విషయంలో వాస్తవ లెక్కలను బయటపెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.