- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు సరైన వైద్యం అందడం లేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, శంషాబాద్: దేశానికే హెల్త్ హబ్‌గా హైదరాబాద్ మారిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆర్కాన్ ప్రయివేటు ఆసుపత్రిని ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా.. పేదలకు సరైన ఆరోగ్య సేవలు అందడం లేదని, ఇది బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నందున, ఈ ఆసుపత్రిలో దానికి తగినట్టు వైద్య సేవలు అందించాలన్నారు.
24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి సూచించారు. వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా పేదలకు సేవ చేసే విధంగా ఉండాలని అన్నారు. యువ డాక్టర్లు చంద్రకాంత్ రెడ్డి, మల్లేష్, వంశీ మోహన్, శివ రాంరెడ్డి, ఖదీర్‌లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ నీరటి తన్వీరాజ్, కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, నీరటి రాజు, కవితా ప్రసాద్, పవన్ గౌడ్, తాజ్ బాబా, అజయ్, మురళి పాల్గొన్నారు.