- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రఘురామ పిటిషన్లను ఇటీవల సీబీఐ కోర్టు కొట్టివేయడంతో బుధవారం ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్‌తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని, వారి బెయిల్ రద్దు చేయాలని అభ్యర్థించారు.
అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు బెయిల్ రద్దు పిటిషన్‌ను రద్దు చేసింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.