- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలను కుక్కలతో పోల్చుతూ కామెంట్లు
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, వైసీపీ స్వతంత్ర్య ఎంపీ రఘురామ కృష్టంరాజు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రిగారూ, వారంతా వేటకుక్కలై వెంటాడే పరిస్థితి వస్తుంది’ అని అన్నారు.
నిరసన తెలిపే వారిని కుక్కలతో పోలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను వేదిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వాన్ని అపార్ధం చేసుకోవాల్సి వస్తోందన్నారు. కాగా రాజధాని విషయంపై స్పందిస్తూ, త్వరలోనే అమరావతిలో మనోధైర్య యాత్రను చేపడతానని వివరించారు.
అమరావతికి సంపూర్ణ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని రఘురాజు స్పష్టం చేశారు. రాజధాని రైతులు, మహిళలు అభద్రతాభావానికి గురికావొద్దని చెప్పారు. అయోధ్య భూమిపూజను ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్షప్రసారం వేయకపోవడం దారుణమన్నారు. అంతేగాకుండా ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడికడతానన్న గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.