కరోనా అంటించేందుకు కుట్ర -ఎంపీ రఘురామ

by Anukaran |
కరోనా అంటించేందుకు కుట్ర -ఎంపీ రఘురామ
X

దిశ, ఏపీ బ్యూరో: నాకు కరోనా అంటించేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… క్రిస్టియన్‌ దళితులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. హిందూ మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఓ మతం మన్ననలు పొందేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏపీ పోలీసులకు చట్టాలపై అవగాహన లేదు. ఆటవిక రాజ్యం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. వైసీపీలోనే కొనసాగుతానని రఘురామ స్పష్టం చేశారు.

Advertisement

Next Story