- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తోంది: ఎంపీ నామా
దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తున్నదని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి నామా నాగేశ్వర రావు మాట్లాడారు. కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాషాయ పార్టీకి భవిష్యత్‌లో దేశ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని మూడు నెలలుగా అడుగుతున్నా.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను, ఎంపీలను విమర్శలు చేస్తూ రైతులను అవమానిస్తున్నారన్నారు. వానాకాలంలో ఎంత పంట తీసుకుంటారో తేల్చి చెప్పాలని కేంద్ర మంత్రికి వివరిస్తే నాలుగు రోజుల్లో మంత్రుల బృందంతో చర్చించిన తరువాత చెప్తామని.. కనీసం ఇప్పటికీ చెప్పలేదన్నారు.
యాసంగి-ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిస్తామని చెప్పి.. ఎంత కొనుగోలు చేస్తామనేది చెప్పకుండా దాటవేస్తూ కేంద్రం పబ్బం గడుపుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత యువనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్, పలువురు అధికారులు కూడా కేంద్రం వద్దకు వచ్చి ధాన్యం కోటాపై స్పష్టత ఇవ్వాలని విన్నవించినా స్పందన లేదని విమర్శించారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ ఎంపీలుగా తాము పార్లమెంటులో తెలంగాణ రైతుల సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రత్యేకంగా నివేదించామని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసనలు చేపట్టామన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో పార్లమెంటు నుంచి వాకౌట్ చేశామని నామా గుర్తు చేశారు.