ఎంపీ నామా విస్తృత పర్యటన.. రైతులు వాటిని ఉపయోగించుకోవాలి..

by Sridhar Babu |
nama
X

దిశ, చింతకాని: చింతకాని మండలంలో సోమవారం ఉదయం టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా ప్రొద్దుటూరు గ్రామం నుండి చింతకానికి PMGSY క్రింద రూ.3 కోట్ల 23 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం నాగులవంచ గ్రామంలో నాబార్డు స్పెషల్ రి- ఫైనాన్స్ క్రింద రూ.65 లక్షల రూపాయల తో సహకార సంఘం గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నాగులవంచ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేశారని, పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని గుర్తు చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో సహయం చేస్తున్నారని.. వాటిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పూర్ణయ్య, మండల జెడ్పీటీసీ పర్సగాని తిరుపతి కిషోర్, నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీలు సరోజిని, నాగరత్నమ్మ, డీసీసీబీ CEO వీరబాబు, జిల్లా సహకార అధికారి విజయకుమారి, పెంట్యాల పుల్లయ్య పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story