- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ నామ మాతృమూర్తికి ఘన నివాళ్లు.. కదిలొచ్చిన జనసందోహం
దిశప్రతినిధి, ఖమ్మం : అమ్మతనానికి వన్నె తెచ్చిన మాతృమూర్తి.. ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన అమ్మ.. ఉత్తమ మాతృమూర్తి అవార్డు గ్రహీత, ఎంపీ నామా నాగేశ్వరరావు తల్లి నామా వరలక్ష్మి ప్రథమ వర్ధంతిని బుధవారం ఖమ్మంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటుగా ప్రముఖులు, వేలాది మంది నామా అభిమానులు తరలివచ్చి వరలక్ష్మి చిత్రపటానికి నివాళి అర్పించారు. వరలక్ష్మి తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలో వరలక్ష్మి-ముత్తయ్యల విగ్రహాలను నామా సోదరులు ఆవిష్కరించారు.
వరలక్ష్మి-ముత్తయ్య పుణ్య దంపతుల స్మారకార్థం స్మృతి వనాన్ని ప్రారంభించారు. నామా కుటుంబ సభ్యులతో పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు, వేలాది మంది నామా అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్మృతి వనంలో నామా కుటుంబసభ్యులు, నామా ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలు, వరలక్ష్మి నిరుపేదలు, వృద్ధులు, మహిళలకు చేసిన సేవలు, పలువురు ప్రముఖుల చేత అందుకున్న అవార్డులకు సంబంధించి వందలాది ఫొటోలతో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీని పరిశీలించిన ఎంపీ నామా నాగేశ్వరరావు, సోదరులు నామా రామారావు, నామా సీతయ్య, నామా కృష్ణయ్య అమ్మనాన్నలతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. జన్మనిచ్చిన అమ్మనాన్నల జ్ఞాపకార్థం నామా సోదరులు నిర్మించిన స్మృతివనాన్ని చూసి పలువురు అభినందించారు. ఇప్పటికే వరలక్ష్మి-ముత్తయ్యల పేరు మీద చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రశంసించారు.