కరోనా కట్టడికి సహకరించాలి : ఎంపీ

by Shyam |
కరోనా కట్టడికి సహకరించాలి : ఎంపీ
X

దిశ, మహబూబాబాద్:
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు.‌ గురువారం మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, జిల్లా కోవిడ్-19 ఇంచార్జీ నోడల్ ఆఫీసర్ రాజేష్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలు కరోనా మహమ్మారి గురించి ఎలాంటి భయాందోళనలు చెందొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అన్నివిధాల సంసిద్ధంగా ఉందన్నారు. మంత్రి ఈటల రాజేందర్ జ్వరం వచ్చినా ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో కరోనా కట్టడి కోసం జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారని, కలెక్టర్ కార్యాలయం సమీపంలోని గిరిజన బాలుర వసతి గృహంలో వంద పడకల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉంచామన్నారు.

అనంతారం మోడల్ స్కూల్లో ఆక్సిజన్ సదుపాయాలతో కరోనా చికిత్స కోసం వందపడకలను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. జిల్లాలోని గూడూరు మండలం పీహెచ్‌సీ‌లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సెంటర్లో కోవిడ్ రాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందజేసినట్టు తెలిపారు. ప్రతిఒక్కరూ బయటకి వెళ్ళేటప్పుడు తప్పపనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా ఆమె సూచించారు.

Advertisement

Next Story