- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్ రాక్స్‌ను అధికంగా కేటాయించండి: బడుగుల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు సింగరేణి బొగ్గును అందించేందుకు గాను రవాణా కోసం కోల్ బాక్సుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో అవసరమైన కోల్ రాక్స్‌లను వెంటనే అందజేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లోని అనెక్స్‌లో బొగ్గు, ఉక్కు, కాపర్‌లపై ఏర్పాటు చేసిన సమావేశంలో లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలున లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తయ్యే బొగ్గు రవాణా చేసే కోల్ బాక్స్ ల కొరత తీవ్రంగా ఉన్నందున, రాష్ట్రానికి కావాల్సిన కోల్ బాక్స్ లను సరఫరా చేయాలని కోరారు.
కోల్ రాక్స్ కొరత కేవలం తెలంగాణకే కాదని దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఉందని గుర్తు చేశారు. అంతేగాకుండా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని, ఇక్కడ ఎస్‌సీ, ఎస్టీలకు కూడా రాయితీతో విద్యుత్‌ను అందచేస్తున్నందున ఈ వర్గాలకు అల్యూమినియం ప్రెసర్ కుక్కర్లను రాయితీ పై అందించాలని కోరారు. వీటితోపాటు రాగి లోహ సంబంధిత పాత్రలు, వస్తువులను కూడా గణనీయంగా వినియోగిస్తున్నందున వాటి ధరలను కూడా తగ్గించి సామాన్యులకు అందుబాటులో తేవాలని బడుగుల లింగయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు.