- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసులకు మాస్క్‌లు అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి
దిశ, నల్లగొండ: కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బందికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించారు. యాదాద్రి జిల్లా సరిహద్దులోని ఆలేరులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తోన్న ఏసీపీ కోట్ల నర్సింహ్మరెడ్డిని కరోనా భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలేరు, భువనగిరి ఆసుపత్రులను విజిట్ చేసి అక్కడ ఐసోలేషన్ కేంద్రాల పనితీరు, సౌకర్యాల గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తన వంతుగా సీఎం రీలిఫ్ ఫండ్‌కు రూ.50లక్షలు విరాళం అందజేసినట్టు చెప్పారు.
tags : MP Komatireddy, masks, police, health department staff, yadadri