- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్ముకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
by Shyam |
X
దిశ నకిరేకల్: నన్ను నమ్ముకొని నా వెంటే ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన యూత్ కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి కిషన్, మాజీ ఉప సర్పంచ్ ముంత సత్తయ్య కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. మృతి చెందిన నాయకులకు నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు చెరో రెండు లక్షల చొప్పున నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికితోడు వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు భూషయ్య, ఉషయ్య గౌడ్, తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story