ఎనిమిది రోజుల్లోనే ఆర్థిక లోటు వచ్చిందా? : ఎంపీ కోమటిరెడ్డి

by Shyam |
ఎనిమిది రోజుల్లోనే ఆర్థిక లోటు వచ్చిందా? :  ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో:
లాక్‌డౌన్ విధించే ముందు రోజు తెలంగాణ ధనిక రాష్ట్రమని, కరోనా నియంత్రణకు రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధమని చెప్పి, ఇప్పుడు ఆర్థిక లోటు అంటూ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తప్పుపట్టాడు. ఇప్పటి వరకు వైరస్ నియంత్రణలో భాగంగా ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖ పలు అంశాలు పేర్కొన్నారు.’ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వేతన జీవులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పెన్షన్‌తో జీవితాన్ని గడుపుతున్న వారు.. తాజా నిర్ణయం‌తో రోడ్డు మీద పడతారని’ తెలిపారు. కొన్ని నెలల కరువు విలయతాండవం చేసినా ఆర్థిక లోటు రాదు.. అటువంటిది కేవలం 8 రోజుల లాక్‌డౌన్‌తోనే ఆర్థిక లోటు వచ్చిందా అని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని.. ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు.

Tags: Lock down, Corona, salaries reduction, open letter, financial deficiency

Advertisement

Next Story

Most Viewed